ఘనంగా చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు

జనంసాక్షి, వంగూర్:
మండల కేంద్రంలో నీ గ్రామ పంచాయతీ ఆవరణలో రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం మరువలేదని, నిజాం రజాకారుల గుండెల్లో నిప్పురవ్వగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ బాంచoద్ అన్న చేతుల్లో నిజాం రజాకారులను గడగడలాడించిన ఆమెకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది భూమి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో నిజాం రజాకారులను రాపాక రామచంద్రారెడ్డి ఆవడాలను ఎదిరించి ఆ పాత్ర ప్రజల్లో చైతన్యo రగిలించింది. ప్రజలు మాస, ప్రాణాలకు రక్షణ లేని నాటి రోజుల్లో మహిళగా గొడ్డలి పట్టి విషనూరు దేశముకులను గడగడ లాడించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లట్టుపల్లి సాయిలు, గ్రామ అధ్యక్షులు గుడ్ల నర్వ సుమన్, ప్రధాన కార్యదర్శి బూషరాజు, శ్రీను, కోశాధికారి లట్టుపల్లి నాగరాజు, కమిటీ సభ్యులు రాజన్న (స్వామి) పర్వతాలు, చక్రవర్తి, కృష్ణయ్య, రామచంద్రం, బాలయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.