*ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (15):* మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోన్ మాత్రలు వేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాధుడు మాట్లాడుతూ మనిషి జీర్ణాశయ గోడలను అంటుకొని నూలి పురుగులు కుంకి పురుగులు ఎలుక పాములు పరాన్న జీవులు ఉంటాయి అని తెలిపారు మనిషి భుజించిన ఆహారాన్ని ఈ పనుల జీవులు తిని ముఖ్యంగా విద్యార్థులను శారీరకంగా ఎదగాకుండా అనారోగ్యo కలుగ చేస్తాయి , నూలి పురుగుల నిర్మూలనకు 400 ఎంజి మాత్రల ను వేసుకోవడం ద్వారా నులిపురుగులను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు ఆరు నెలలకుఒకసారి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో ఏమైనా నులి పురుగులు ఉంటే చనిపోతాయని మాత్రలు వేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారుఅని అన్నారు విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు ధరించాలని భోజనానికి ముందు తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని బహిరంగ ప్రదేశంలో మనవిసర్జన చేయరాదని విద్యార్థులకు సూచించారు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడి సెంటర్ నందు ఐదు నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి పాఠశాల, కళాశాల, నందు మాత్రం వేస్తారని, విద్యార్థులు మాత్రమే తెలిపారు సెప్టెంబర్ 22 తేదీ నాడు మాత్రం వేస్తారని తెలిపారు డిఎం అండ్ హెచ్ ఓ శ్రీనివాసులు, మంజుల, ఎంపీపీ సంధ్య, జడ్పిటిసి భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆప్షన్ సభ్యుడు మతిన్, రైతు బంధు మండలాధ్యక్షుడు తిరుపతయ్య యాదవ్, ప్రిన్సిపాల్ దీప్తి, వైద్య సిబ్బంది సురేష్ కుమార్, సుచిత్ర,కౌసల్య, వెంకటమ్మ, బాలకృష్ణమ్మ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు
Attachments area