ఘనంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు

మల్దకల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)మండల కేంద్రంలోని మండలప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఎస్ ఐ ఆర్ శేఖర్, మండల పరిషత్ కార్యాలయం ముందు వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,తహసిల్దార్ కార్యాలయం ముందు తాసిల్దార్ హరికృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రిన్సిపల్ రమేష్ లింగం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సుప్రీత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద హెచ్ఎం ఇమాన్యుల్ ,గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ యాకోబు,జాతీయ జెండా ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయ వద్ద సర్పంచులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.వైస్ ఎంపీపీ ఈరన్న మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను జాతి నిర్మాతలను నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నేటికీ 75 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నమన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు,ఎంపీడీవో జీ కృష్ణయ్య,తహసిల్దార్ హరికృష్ణ, ఎంపీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి,సూపర్డెంట్ పెద్ద నరసన్న,ఏపీవో స్వామి సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాష్ రెడ్డి,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటన్న, మార్కెట్ డైరెక్టర్ సవరన్న, డిప్యూటీ తహసిల్దార్ మదన్మోహన్ గౌడ్,ఆర్ఐ రామకృష్ణ,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,ఎంపిటిసి రాజు, టిఆర్ఎస్ కోఆప్షన్ హైదర్ సాబ్, మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ మహబూబ్ అలీ,టిఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి,ఆంజనేయులు, నరేందర్,తిమ్మరాజు,ఉప్పరి నారాయణ,గోవిందు తదితరులు పాల్గొన్నారు.