ఘనంగా జాతీయ సేవా పథకo దినోత్సవం

మల్దకల్ సెప్టెంబర్24(జనం సాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సేవా పథకం దినోత్సవం శనివారం జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలోని కంపు చెట్లను, ముళ్లపొదలను తొలగించి శుభ్రం చేశారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  ప్రిన్సిపల్ ఎం రమేష్ లింగం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ విద్యార్థి జీవితంలో తప్పకుండా ఎన్ఎస్ఎస్ వాలంటరీగా చేరి సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు.అదేవిధంగా నేటి యువత భారతదేశానికి పట్టుకొమ్మలని కావున వారిని ఎన్ఎస్ఎస్ లో భాగస్వామ్యం చేసి భారతదేశ అభివృద్ధిలో వారి భాగస్వామి పెంచాలని ఈ జాతీయ సేవా పథకాన్ని రూపొందించబడిందని తెలియజేశారు.ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేస్తూ విద్యార్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.మానవసేవయే మాధవ సేవ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ పథకం రూపొందించబడింది అని, నేడు స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు కూడా దీని ఆధారంగా రూపొందించ బడినవేనని సూచించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ 1 రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావము,ముఖ్య ఉద్దేశము,దాని లక్ష్యాలు, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ప్రణాళికలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సింలు,అధ్యాపకులు గోవర్ధన్ శెట్టి, శివకుమార్ ,తిమోతి, శ్రీనాథ్, రమేష్ ,ఆంజనేయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పర్వీన్ సుల్తానా,సూరిబాబు, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.