ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

దోమ డిసెంబర్ 6(జనం సాక్షి)
ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ని పురస్కరించుకొని దోమ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ దోమ మండల్ అధ్యక్షులు గార్లపల్లి మల్లన్న మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను మరియు బిసి, ఎస్సి ,ఎస్టి, రిజర్వేషన్లను కల్పించడం జరిగింది, కానీ ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
85 శాతం ఉన్నటువంటి బహుజనులు ఈరోజు విద్య, ఉద్యోగ , ఆర్థిక రంగాలలో వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో బీసీలు 54% కి పైబడి ఉన్నారు కానీ వారి యొక్క రిజర్వేషన్లు 27% శాతమే ఉన్నాయి కాబట్టి బీసీల జనాభా ప్రాతిపదికన వారికి 50 % శాతం పైగా రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు మరియు బీసీల జనగణన జరగాలని మాట్లాడారు. అంబేద్కర్ కలలుగన్న రాజ్యం లో బహుజనులకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయం లలో సమాన న్యాయం జరగాలంటే అది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే జరుగుతుందని దోమ మండల్ అధ్యక్షులు గార్లపల్లి మల్లన్న అన్నారు.
నివాళులు.
దోమ మండల్ పాలేపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాలలతో ఘన నివాళలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు వెంకట్ సాలేటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు విజయ రాజు బీసీ నాయకులు నరసింహులు వెంకటేష్ తెలంగాణ ఉద్యమకారుడు రామన్న పాలపల్లి నరసింహులు గిరి శేఖర్ వెంకటేష్ అయినా పూర్ అంజయ్య సాయికుమార్ అనిల్ ప్రశాంత్ దోమ డప్పు రమేష్ వివిధ సంఘాల నాయకులు బహుజన నాయకులు తదితరులు పాల్గొన్నారు