ఘనంగా నిర్వహించింన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

 

నాగర్ కర్నూల్ రూరల్ 2022 సెప్టెంబర్ 16(జనంసాక్షి)

 

రాజరిక పాలన నుండి ప్యాజాస్వామ్యంలో అడుగిడిన తెలంగాణా ప్రజలకు సెప్టెంబర్ 17సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి.జనార్దన్ రెడ్డి అభివర్ణించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న.ఈ తరుణంలో సెప్టెంబర్ 17న 16 జిల్లాల తెలంగాణ సమైక్య భారత దేశంలో విలీనం అయిన రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 16నుండి 18వరకు తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.ఇందులో భాగంగా శుక్రవారం తొలి రోజు 15 వేల పైచిలుకు జనాలతో స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నుండి జిల్లా పరిషత్ మైదానం వరకు కిక్కిరిసిన జనసందోహంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.భారత దేశానికి స్వాతంత్య్రం 15ఆగష్టు,1947నాడు సిద్దిస్తే అప్పటికి ప్రత్యేకంగా రాజరిక వ్యవస్థలో ఉండి భూమి కోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి సంకెళ్ళ నుండి బయట పడటానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ఫలితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తెగువతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారత దేశంలో విలీనమయ్యిందని పేర్కొన్నారు.అందుకే సెప్టెంబర్ 16 నుండి 18 వరకు 3రోజుల పాటు తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా తెలంగాణా ఉద్యమంలో పోరాటం చేసిన యోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు.బూర్గుల.రామకృష్ణ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడంతో తిరిగి వివక్షకు గురైందన్నారు.తొలిదశలో జరిగిన తెలంగాణా ఉద్యమం విఫలమైతే 2001లో పార్టీని స్థాపించి అందరిని మెప్పించి సకల జనుల ఆమోదంతో తెలంగాణ ఏర్పడిందని తెలుయజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి.పద్మావతి మాట్లాడుతూ,రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు.తెలంగాణా సచివాలయానికి డా.బి.ఆర్.అంబెడ్కర్ పేరు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబెడ్కర్ పెరు పెట్టాలని డిమాండు చేశారు.జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ,స్వాతంత్ర్య వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను (3)రోజుల పాటు నిర్వహించుకుంటున్నామని.ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.స్వాతంత్ర్య పోరాటంలో ఏ రకమైన స్ఫూర్తితో పోరాటం చేశామో అదే స్ఫూర్తి మనం చేసే ప్రతి పనిలో కనిపించాలని పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ కె.మనోహర్ మాట్లాడుతూ,16 జిల్లాలతో రాజరిక పాలనలో ఉన్న తెలంగాణ సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ తెగువకు సమైక్య భారత దేశంలో విలీనం అయ్యిందని.ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు జరిగిన ఈ భారీ ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభంచగా సాంస్కృతిక కార్యక్రమాలు,డప్పులు,కోలాటాలు,గోండు వేషధారణ,అన్ని జాతుల వారు తమ సంస్కృతుల వేషధారణతో జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొనటంతో నాగర్ కర్నూల్ పట్టణం పండగ వాతావరణంతో ర్యాలీ శోభరిల్లింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యం.మను చౌదరి,ఆదనపు కలెక్టర్ మోతిలాల్,డి.సి.సి.బి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్,మార్కెట్ కమిటి చైర్మన్ గంగనమోని.కుర్మయ్య, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని.శ్రీనివాస్ యాదవ్,జడ్పిటిసిలు,ఎంపిపి లు జిల్లా అధికారులు,మహిళా సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు,ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.