ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు…
నిర్వర్తించిన ఇల్లందు టీడీపీ నాయకులు…
ఇల్లందు ఆగస్టు 30 (జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోగల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 64 వ జయంతి వేడుకలను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పరిటాల రవీంద్ర చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, ఇల్లందు పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ , టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాందావత్ రమేష్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కి పరిటాల రవీంద్ర ఎంతో సేవలు చేశారని కొనియాడారు. అటు మంత్రిగా కూడా ఎన్నో సంస్కరణలు చేశారని, నందమూరి తారకరామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నారా చంద్రబాబు నాయకత్వంలో పార్టీషిత కోసం అహర్నిశలకు శ్రమించారని, ఎన్టీఆర్ క్యాబినెట్లో,చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అనేక పోర్టుపోలియోలు నిర్వహించరాని, తను ఈరోజు లేకపోవడం తెలుగుదేశం పార్టీకే ఎంతో బాధాకరమని వారు లేని లోటును ఎవరు పుడ్చలేరని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు,అయ్యోరి నాగరాజు,కంది రవి, గుళ్ళ మోగిలి,గోరెంట్ల రామయ్య,రమేష్, గోపాల్,గోగేలా రాజేష్, దేవరకొండ నవీన్, వాసం వినీత్, శ్యామ్, వేమూరి రాజు, మాటేలా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.