ఘనంగా “ప్రతిభ-రఘు” ల వివాహ వేడుక, దగ్గరుండి అన్నీ తామై జరిపించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు జనం సాక్షి, నర్సంపేట

పేదింటి వనితకు  హిందూ సాంప్రదాయ బద్ధంగా దగ్గరుండి పెండ్లి జరిపించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు.చీరె సారేలతో మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన పరిణయం.పాలన అంటే సామాజిక ప్రజా అవసరాల బాధ్యతను నెరవేర్చడమని ప్రజల పట్ల వారికున్న ఆత్మీయతను చాటుకున్న ఎమ్మెల్యే పెద్ది దంపతులు.కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి పథకం రూపకల్పనకు నాంది పలికిన గిరిజన మహిళ లూనావత్ కల్పన కుమార్తె “చంద్రకళ వివాహాన్ని” ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే దంపతులు.
కాగా నేడు చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన నిరుపేదింటి మహిళ “ప్రతిభ” మరియు రఘుల వివాహానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరోసారి వేదికైంది.
గత రెండు నెలల క్రితం ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కోనాపురం గ్రామానికి వెళ్ళిన జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారు, దళిత సామాజిక వర్గానికి చెందిన మైదం ప్రతిభ కుటుంబ నేపథ్యాన్ని చూసి చలించిపోయింది.
కూలిపని చేసుకుంటూ అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రతిభ తల్లిదండ్రులు మైదం “మల్లేష్- రాధ” ల దీనస్థితిని గమనించి ప్రతిభ వివాహన్నీ తామే దగ్గరుండి జరిపిస్తామని భరోసా నిచ్చారు. ఇట్టి విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి తెలిపడంతో ప్రతిభ కుటుంభ సభ్యులు, గ్రామస్తులు, మరియు నాయకులతో చర్చించి నిర్ణయించిన నేటి ముహూర్తాన, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వరంగల్ పట్టణ వాసి రఘుతో నేడు సంప్రదాయ బద్దంగా ఘనంగా వివాహాన్ని జరిపి0చి, నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ ఎమ్మెల్యే దంపతులు.
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రతిభ రఘుల వివాహం తమ సొంత ఖర్చులతో జరిపించి, ఒక పేద కుటుంబానికి అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని,
నియోజకవర్గానికి చెందిన ప్రతి నిరుపేద కుటుంభ దీనస్థితిని మెరుగపర్చేందుకు మావంతు సహాయ, సహకారాలు తప్పక అందించి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.తమ కుమార్తె వివాహానికి అన్ని తామై అండగా నిలిచిన పెద్ది దంపతులకు భావోద్వేగానికి లోనవుతూ కృతజ్ఞతలు తెలిపిన మైదం ప్రతిభ తల్లిదండ్రులు.
ఈ వివాహ వేడుకలో పెండ్లి పెద్దలుగా వ్యవహరించిన ఎమ్మెల్యే దంపతులతో పాటు చెన్నారావుపేట మండల నాయకులు కోనాపురం గ్రామ సర్పంచ్ వెల్దే సుజాత సారన్గం, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి,బాబు రావు గ్రామ పార్టీ అధ్యక్ష్యులు దొంగల రాజ్ కుమార్, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు,నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Attachments area