ఘనంగా ప్రారంభించిన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు…
ఊరుకొండ, ఆగస్టు 8 (జనం సాక్షి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న
75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా
ఊరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట, నర్సంపల్లి గ్రామపంచాయతీలలో ఇంటింటికి జాతీయ జెండా పతాక పంపిణీ కార్య క్రమం లో గ్రామ సర్పంచ్ లు దండోద్కర్ అనితనాగోజి, వాగుదాస్ నిరంజన్ గౌడ్ ల అధ్యక్షతన జాతీయ జెండాలను చేశారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగుర వేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుచ్చమ్మపాపయ్య గౌడ్, లక్ష్మయ్య, వార్డ్ సభ్యులు శ్రీను. సిద్దు. అజార్. కారోబార్ జహీర్, రామాంజనేయులు. కృష్ణ. శ్రీను, సాగర్ మల్టిపర్పస్ వర్కర్స్, గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు