ఘనంగా మనగుడి కార్యక్రమం

విజయనగరం, ఆగస్టు 2 : టిటిడి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్‌ వివేకానందా కాలనీలో వేంకటేశ్వర ధ్యానమందిరం నందు గురువారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గుడి పరిసరాలను తోరణాలతో అలకరించి, ప్రాంగాణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు ఉదయాన్నే భక్తుల సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులంతా సహస్రనామా సంకీర్తన ఆలపించారు. రాఖీ పండగ కూడా ఉండడం వల్ల పండితులు రాంబాబు, నరసింహాచార్యుల ఆధ్వర్యంలో భగవంతునికి సమర్పించిన రక్షాబంధనాలను భక్తులకు ధరింపజేశారు. తీర్థప్రసాధాలతో, భక్తుల దైవ నామస్మరణతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మురళీమోహన్‌, రత్నారావు, విజయలక్ష్మి, ముద్దుకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు