ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినం.
ప్రవక్త చూపిన మార్గమే దైవ మార్గం.
ప్రవక్త చూపిన మార్గాన్ని ఎంచుకుంటేనే స్వర్గ లోకం ప్రాప్తి.
దైవ మార్గాన్ని చూపిన ముహమ్మద్ ప్రవక్త.
జామే నిజామియా ఆలిమ్ మౌలానా. మొహమ్మద్ అజీముద్దీన్ నక్ష్ బందీ.
ముస్లింల భారీ శోభయాత్ర.
ఆస్పత్రులలో పండ్లు జ్యూస్లు పంపిణీ.
జామా మస్జిద్ ఆవరణలో అన్నదానం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్9 (జనంసాక్షి):
మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గమే స్వర్గ లోకానికి రాజమార్గమని జామే నిజామియా అరబ్బీ యూనివర్సిటీ ఆలిం మౌలాన మహమ్మద్ అజీముద్దీన్ నక్షబంది అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్క రించుకొని మీలాదున్నబి సందర్భంగా స్థానిక జామా మస్జిద్ లో శనివారం రాత్రి సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా మౌలానా మొహమ్మద్ అజిముద్దీన్ మాట్లాడుతూ భూమి మీదికి దేవుడు పంపించిన చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అన్నారు. ఖురాన్ భూమి మీదికి వచ్చిన తర్వాత సర్వ మానవాళికి దేవుడు చూపిన మార్గాన్ని ప్రజలకు బోధించింది మహమ్మద్ ప్రవక్త అన్నారు.ఇస్లాం ధర్మంలో ప్రజలు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తూ..సన్మార్గంలో నడిచినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అన్నారు.నమాజ్, రోజా,జకాత్, హజ్ వంటివి కచ్చితంగా పాటిస్తూ దైవ మార్గాన్ని ఎంచుకోవాలి అని ఆయన సూచించారు. అదేవిధంగా స్థానిక మస్జిదే సయ్యదా అమీనా లో జరిగిన మీలా దున్నభి కార్యక్రమంలో మౌలానా జునేద్ హసన్ మహమ్మద్ ప్రవక్త జన్మదినం,ఇస్లాం మత ప్రాముఖ్యతను వివరించారు.
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరిం చుకొని శనివారం రాత్రి ప్రత్యేక నమాజ్ తో పాటు జాగరణ కార్యక్రమాలను నిర్వహించారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినo సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామా మసీద్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా రంగురంగుల విద్యుత్ కాంతులు, ఆకుపచ్చని జెండాలతో ముస్తాబు చేశారు. జామా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మమ్మద్ జైనుల బుద్ధిన్ నక్ష్ బంది వల్ ఖాద్రి ఆధ్యక్ష తన కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం ఉదయం జామా మస్జిద్ ఆవరణలో మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క వస్తువులను ప్రదర్శించడం జరిగింది. ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మధ్యాహ్నం జామా మస్జిద్ నుంచి పట్టణ యువకుల ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ శోభాయాత్రను నిర్వహించారు.సబీల్ ఉల్ హస్నాత్ సంస్థ బాధ్యులు మహమ్మద్ ఖాదర్,మహమ్మద్ ఖాజా బాబా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ముస్లిం మత పెద్దల చేతుల మీదుగా రోగులకు పండ్లు, బ్రెడ్లుపంపిణీ చేశారు.శోభాయాత్ర అనంతరం వక్ఫ్ కాంప్లెక్స్ పై జెండా ఆవిష్కరించారు.ప్రవక్త జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచుతూ శుభాకాక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ముస్లిం పెద్దలు,యువకులు,చిన్నారులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|