-->

ఘనంగా మహాకాళి జాతర

వేములవాడ,జనంసాక్షి, జూలై 24: వేములవాడ ఉజ్జయిని మహాకాళి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు . ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు, కౌన్సిలర్లు మారం కుమార్, రేగుల సంతోష్ బాబు, మున్సిపల్ అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించారు.