ఘనంగా రిపబ్లిక్‌డే ముగింపు వేడుకలు
దిల్లీ: దిల్లీలో గణతంత్ర దిన ముగింపు వేడుకలు(బీటింగ్ ద రిట్రీట్) విజయ్ ాక్‌లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆహ్లాదకరమైన సాయం సంధ్య వేళ, వీనులవిందైన సంగీతంతో పాటు,అద్భుతమైన విన్యాసాలను త్రివిధ దళాలకు చెందిన 15 సైనికబృందాలు ప్రదర్శించాయి.