ఘనంగా లక్ష కుంకుమార్చన
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): స్థానిక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసపు శుక్రవారంను పురస్కరించుకొని ఆండాళ్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో లక్ష్మీ అమ్మవారికి లక్ష కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో లక్ష్మీ అమ్మవారికి పంచామృతములతో తిరుమంజన స్నపనం నిర్వహించి, అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు.అనంతరం భక్తుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన శ్రీచూర్ణముతో లక్ష కుంకుమార్చన ఘనంగా జరిపించారు.ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రావణమాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు, సకల సంపదలు చేకూరుతాయన్నారు.లక్ష్మీ సమేతుడైన స్వామివారిని ఈ మాసంలో దర్శించిన వారికి సకల సమృద్ధి కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి, అర్చకులు శ్రీహరి ఆచార్యులు, సంకర్షణ ఆచార్యులు, ఫణి కుమార్ ఆచార్యులు, హరిచరణ్ ఆచార్యులు, టిఎస్వి సత్యనారాయణ, గజ్జల రవీందర్, కరుణాసాగర్ రెడ్డి , కందగట్ల శ్రీనివాస్, మంజుల, సుభాషిని, పద్మ , కవిత , లక్ష్మి , ఉమారాణి, జ్ఞాన కుమారి తదితరులు పాల్గొన్నారు.