ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

వనపర్తి అక్టోబర్ 9 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ మండల దేవన్న యని నాయుడు, బోయ రిజర్వేషన్ కమిటీ రాష్ట్ర నాయకులు బాలస్వామి,కళాకారుడు శివలింగం నాయుడు నువ్వు మాట్లాడుతూ మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆది కవి వాల్మీకి మహర్షి అని వారు కొనియాడారు వారిని ఆదర్శంగా తీసుకొవాలని,సంస్కృతంలో మొట్టమొదటగా గొప్ప కావ్యాన్ని ప్రజలకు అందించాలని అలాంటి సాహిత్యాన్ని ఉత్తమమైన రీతిలో విశ్వమానవునికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మాత్రమే వారన్నారు వాల్మీకి రాసిన రామాయణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని గొప్పగా ఎదగాలని వారు వివరించారు ప్రజావాజకరుడు రాజారాం ప్రకాష్, కుంకల నారాయణ,నరసింహ శర్మ, పికిలి రాము, రఘు,వెంకటేష్ నాయుడు ఖాదర్బాషా విజయ్ నరేందర్ మన్యం మండల వెంకటేష్ గిరి రాజా చారి తదితరులు పాల్గొన్నారు.