ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక మార్కెట్ లో గల వేంకటేశ్వర స్వామి ఆలయం లో పూజలు నిర్వహించిన అనంతరం మూడు వందల మందికి అన్నదానం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడం, క్రీడా రంగం అభివృద్ధి కోసం అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి, పార్లమెంట్ నియోజకవర్గాన్ని జోడిస్తూ ప్రతి నియోజకవర్గాన్ని కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి శ్రీకారం చుట్టారు అని వెల్లడించారు. కరీంనగర్ నగరాన్ని ముంబాయికి అనుసంధానం చేస్తూ ప్రత్యేక రైల్ ను మంజూరు చేయించడం జరిగింది అన్నారు . కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ యావత్తూ తెలంగాణ కు రావాల్సిన విభజన హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ఉద్యమం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుడు కెమసారం తిరుపతి, గుర్రం అశోక్ గౌడ్, ప్యాట సురేష్, కొత్తకోండ శ్రావాణ్, ఠాగూర్ సాయి సింగ్ తదితరులు పాల్గొన్నారు.