ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ ధివాస్..
బాన్సువాడ, జనంసాక్షి (జూన్ 23):
జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ జనసంఘ్ వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ భావం విషయంలో యువతకు స్ఫూర్తిగా నిలిచారని,రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఒకే దేశంలో ఉండరాదని ఆర్టికల్ 370 వెంటనే రద్దు చేయాలని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ , సాయిలు, బిజెపి సీనియర్ నాయకులు కొత్తకొండ భాస్కర్, అర్సపల్లి సాయి రెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనాల గంగారెడ్డి, లక్ష్మణ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు చీకట్ల రాజు, బిసి మండల అధ్యక్షుడు మహేష్, హన్మండ్లు, బీజేవైఎం నాయకులు రాజా సింగ్, శ్యామ్, సునీల్ రావు, బిజెపి నాయకులు తుప్తీ ప్రసాద్, కొండని గంగారం, పాలకుర్తి విట్టల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు