ఘనంగా షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు.
బెల్లంపల్లి, అక్టోబర్22, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో శనివారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ 122 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ కిరణ్ కుమారి, డాక్టర్ షబ్బీర్ అహ్మద్, డాక్టర్ యంఎ అజీజ్, ఎ శిలా, బి సంధ్య చేతుల మీదుగా రోగులకు అన్నదానం మరియు బట్టలు పంపిణి చేశారు. అనంతరం గౌరవ అధ్యక్షుడు యంఎ అజీజ్ మాట్లాడుతు అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్లో షఫీకుర్ రెహమాన్, మజ్హరున్నీసా దంపతులకు 1900 అక్టోబర్ 22న జన్మించాడని, మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమము ప్రారంభించినప్పుడు అష్ఫాకుల్లా ఖాన్ పాఠాశాలలో విద్యాభ్యాసం చేసేవాడిని, నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నాను, నా త్యాగం వృథా కాదు మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుందని. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుందని, చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయని, దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను’ అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, ఖ్వాజ మొయినుద్దీన్, యండి జాఫర్, రసూల్ షరీఫ్, రషీద్ ఖాన్, గజ్జల సందీప్ తదితరులు పాల్గొన్నారు.