ఘనంగా హిందీ దినోత్సవం…

కేసముద్రం సెప్టెంబర్ 14 జనం సాక్షి /గురువారం రోజున సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కేసముద్రం విలేజ్ లో హిందీ దినోత్సవం జరిపారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు హిందీలో ఉపన్యాసాలు ఇచ్చినందుకు బహుమతి ప్రధానోత్సవం చేశారు.ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులకు బండారు నరేందర్  మాట్లాడుతూ సెప్టెంబర్ 14,1949లో రాజ్యాంగంలో హిందీ భాషను ఆమోదించడం వలన ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాం.మనదేశంలో హిందీ అనేది ప్రధాన భాష అని దాన్ని కూడా నేర్చుకోవలసిన అవసరం విద్యార్థులకు ఉందని తెలియజే శారు.హిందీ మాట్లాడడం వల్ల చాలా రాష్ట్రాల్లో సంచరించవచ్చని తెలియజేశారు.  భారతీయ ప్రముఖ గ్రంథాలు హిందీల లో లభ్యమవుతున్నాయని తెలియజేశారు.హిందీ ఉపాధ్యాయురాలు పార్వతి మాట్లాడుతూ హిందీ భాష ఎంతో ప్రాధాన్యత గలదని అనేక రాష్ట్రాల్లో  ఉపయోగంలో ఉన్నదని,హిందీ మాట్లాడుతూ హిందీకి సంబంధించినటువంటి విషయాలను చూసినట్లయితే హిందీ బాగా వస్తుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాగమణి,సత్యనారాయణ,  గౌరీ శంకర్,రామయ్య మరియు ట్రైనీ  టీచర్స్ సృష్టి యాదవ్,  స్థిత ప్రజ్ఞ, భావన,  అర్చన పాల్గొన్నారు.