ఘ‌నంగా వ‌జ్రోత్స‌వాలు… నల్లగుంట గ్రామం లో జాతీయ జెండాతో ర్యాలీ…

నినాదాలతో దద్దరిల్లిన వాడలు….
గ్రామ ప్రజలంతా వజ్రోత్సవాలలో దేశభక్తి తో పాల్గొంటున్నారు….
గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి…
వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్13,
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని నల్లగుంట గ్రామం లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నీ నిర్వహించారు.నల్లగుంట
గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా నల్లగుంట  గ్రామ  సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో  ర్యాలీ నీ నిర్వహించారు. అంగన్వాడీ, ఆశాలు,విద్యార్థిని విద్యార్థులు,మహిళ సంఘం నాయకులు,వార్డ్ సభ్యులు,
గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తీగల రజిత,ఉప సర్పంచ్ భూక్యా శంకర్,వార్డ్ సభ్యులు,ఏఎన్ఎం అనురాధ,ఆశాలు లలిత,రాణి,మహిళ సంఘం నాయకులు మంతెన రమ,బల్ల నాగరాణి,మందల మానస,అంగన్వాడీ టీచర్ కమల,జయ,రోజా,రజిత,గ్రామ పంచాయతీ సిబ్బంది సత్యపాల్,
రాముడు,వెంకటేష్,రవి తదితరులు పాల్గొన్నారు.