*చందా నాగిరెడ్డి మృతి బాధాకరం*

కోదాడ. జులై.21(జనం సాక్షి)
 కోదాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలు,చందా నిర్మల భర్త  చందా నాగిరెడ్డి,మృతి చెందడం,బాధాకరం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసం నందు,చందా నిర్మలను మరియు కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, పరమర్శించారు. అనంతరం క్రీడా రంగంలో వారుకున్న మక్కువను గుర్తు చేశారు. క్రీడారంగంలో గొప్ప క్రీడాకారుడుగా,గుర్తింపు తెచ్చుకున్న నాగిరెడ్డి, లేని చోటు తీరనిదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, కోదాడ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు  ఖదీర్, కట్టబోయిన శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, ఒంటి పులి శ్రీనివాస్, గంధం పాండు, గ్రంథాలయ చైర్మన్ రహీం, కోట మధుసూదన్, వేలాద్రి, వీరస్వామి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area