చంద్రబాబుతో పొత్తు అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడమే: కెటిఆర్
పరిగి,నవంబర్21(జనంసాక్షి): తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్ పార్టీ పొత్తు అనైతికమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారం/-తా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న టీడీపీతో పొత్తు అంటే పరిగి రైతుల నోటిలో మట్టికొట్టడమేనన్నారు. పరిగి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి విూడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ అంతటా టీఆర్‌ఎస్ గాలి విస్తుందన్నారు. పరిగిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమేనని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వెంట స్థానిక టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.