చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి

1

– నారాయణ

హైదరాబాద్‌,మే 4 (జనంసాక్షి):

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు నమోదు చేయాలని  సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించడంలో ఇద్దరు సిఎంలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ ఇద్దరు కేంద్రం మెడలు వంచి హక్కులు సాధించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. సోమవారం నారాయణ గవర్నర్‌ నరసింహన్‌ను  కలిశారు. కాకినాడ జేఎన్టీయూ అక్రమాలపై విచారణ జరిపించాలని నారాయణ గవర్నర్‌ను కోరారు. జేఎన్టీయూలో వంద కోట్ల స్కాం జరిగిందని  నారాయణ ఆరోపించారు. ఈ స్కాం పై తక్షనం విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నారాయణ కాకినాడ జేఎన్టీయూలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.   అనంతరం నారాయణ విూడియాతో  మాట్లాడారు. శేషాచలం ఎన్కౌంటర్‌ ఘటనను తప్పుపట్టారు. ఆంధప్రదేశ్‌కు  ప్రత్యేక ¬దా సాధించకపోతే మంత్రివర్గంతో సహా చంద్రబాబు రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు.