హమాస్ 30 వేల మంది కొత్త యోధులను నియమించుకుంటుండటంతో ఇజ్రాయెల్ , అమెరికాకు భారీ హెచ్చరిక: ఇది ప్రమాదకరమైనది ఎందుకంటే….

ఇంటర్నెట్ డెస్క్ (జనంసాక్షి): గాజాలో యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న హమాస్.. ఇప్పుడు సైన్యంలో చిన్నపిల్లలు, యువతను కూడా నియమించుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటికే దాదాపు 30,000 మంది యువతను ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్లో చేర్చుకొన్నట్లు సౌదీకి చెందిన అల్ అరేబియా ఛానెల్ తన కథనంలో పేర్కొంది. వీరిలో చాలామంది గతంలో శిక్షణకు హాజరైనవారు ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేసింది. కాకపోతే ఆ క్యాంపు ఇప్పటికీ ఉందా.. లేదా అనే అంశంపై స్పష్టత లేదని పేర్కొంది. కాకపోతే కొత్తగా హమాస్లో చేరిన వారికి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లు ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్ప ఇక ఇతర నైపుణ్యాలు లేవని పేర్కొంది. వీరి నియామకాలు కచ్చితంగా ఎప్పుడు జరిగాయో కూడా అల్-అరేబియా వెల్లడించలేదు. కానీ, జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దైన తర్వాతే వీరు గ్రూపులోకి వచ్చి ఉంటారని పేర్కొంది.ప్రస్తుతం హమాస్ వద్ద ఆయుధాలు, డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణుల కొరత తీవ్రంగా ఉంది. గతంలో వాడిన క్షిపణుల శకలాలను, పేలకుండా ఉండిపోయిన ఇజ్రాయెల్ దళాల మందుగుండును రీసైకిల్ చేస్తున్నారు. వీటిని భూమి పై అమర్చే పేలుడు పదార్థాలుగా వాడుతున్నట్లు తెలుస్తోంది. హమాస్ నిధులలేమితో కటకటలాడుతోంది. కనీసం సంస్థలోని సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని స్థితికి జారిపోయింది. ఈ పరిస్థితిని అరబ్ ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రహించాయట. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించడంతో.. హమాస్ దోచుకొని విక్రయించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆ పతిక పేర్కొంది.

తాజావార్తలు