గుజరాత్‌లో బీజేపీని ఓడిరచి తీరుతాం
` కొత్త నాయకత్వాన్ని తీసుకుని వస్తాం
` మా వ్యూహాలు మాకున్నాయి: రాహుల్
` నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను: రాహుల్
అహ్మదాబాద్(జనంసాక్షి):రాష్టీయ్ర స్వయం సేవక్ సంఫ్‌ు, బీజేపీని ఓడిరచగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ నైతిక్థసైర్యం కోల్పోయినట్టు కనిపిస్తున్న ప్పటికీ రాష్ట్రంలో బీజేపీని ఓడిస్తామని పార్టీ సీనియర్ నేత,లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఓడిరచగలదనే విషయం ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. దీనిపై జిల్లాలకు చెందిన సీనియర్ నేతలను తాను కలుసుకున్నానని, చక్కటి చర్చలు జరిగాయని తెలిపారు. పార్టీలోని అంతర్గత సవాళ్లను పరిష్కరించేందుకు రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని పరిచయం చేస్తామని చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇదే విషయం స్పష్టం చేశారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గుజరాత్‌లో పార్టీని పునర్వవస్థీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను రాహుల్ ప్రస్తావిస్తూ, దీనిపై చాలా నెలలుగా పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయం పోరాటం కాదని, సైద్ధాంతిక పోరాటమని అన్నారు. నాయకుల మధ్య పోటీ వినాశకరమని, నిర్మాణత్మకం కాదని నేతలు తనకు చెప్పారని అన్నారు. పార్టీలో నాయకత్వ సవాళ్లను గురించి మాట్లాడుతూ, గుర్రాలలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి రేసులకు ఉద్దేశించినవని, రెండో రకం పెళ్లిళ్లకు ఉద్దేశించినవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు వెడ్డింగ్ హార్స్‌లను రేసులకు, రేసింగ్ హార్స్‌లను పెళ్లిళ్లకు పంపుతున్నట్టు నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు.
నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను
భారతదేశానికి స్వేచ్ఛను సాధించడంలో, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని ఇవ్వడమే మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వం అని కాంగ్రెస్ నాయకుడు, లోక్?సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన తన ముత్తాత నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందినట్లు తెలిపారు. పార్టీ నాయకుడు సందీప్ దీక్షిత్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు మాట్లాడారు. ‘నెహ్రూ మాకు రాజకీయాలు నేర్పలేదు. భయాన్ని ఎదుర్కోవడం, సత్యం కోసం నిలబడాలనే మాకు నేర్పించారు. అణచివేతను ఎదిరించి చివరకు స్వేచ్ఛను పొందే ధైర్యాన్ని భారతీయులకు అందించారు. చివరకు స్వేచ్ఛను సాధించడానికి ప్రేరణ ఇచ్చారు. కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన అన్వేషకుడు కూడా. సత్యం, ధైర్యం ఆయన నుంచే నేను వారసత్వంగా పొందాను. అన్వేషించడం, ప్రశ్నించడం, ఉత్సుకతో పాతుకుపోవడం ఇది నా రక్తంలోనే ఉంది. నా జీవిత లక్ష్యం కూడా సత్యాన్ని అన్వేషించడమే. ఆ సత్వాన్వేషణే ఆయన జీవితాన్ని నిర్మించిన ప్రాథమిక సూత్రం. భయంతో స్నేహం చేయడం ఎలా అని గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, బోస్ బోధించేది అదే. గాంధీజీ సత్యం తప్ప మరేమీ లేని సామ్రాజ్యాన్ని నిలబెట్టారు’ అని అన్నారు. ఇక తన అమ్మమ్మ, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, నెహ్రూ గురించిన అనేక కథలు తనకు చెబుతూ ఉండేవారని అన్నారు. నెహ్రూ ఎలా తనకు ఇష్టమైన పర్వతాలలో మంచు గడ్డల మధ్య వెళ్లి ప్రమాదంలో పడిపోవడం, జంతువులు ఎలా కుటుంబంలో భాగంగా ఉండేవి, వ్యాయామాన్ని ఎంత మాత్రం మిస్ అవ్వకుండా ఉండేవారని చెప్పేవారని తెలిపారు. ‘ నా తల్లి ఇప్పటికీ తోటలో పక్షులను గమనిస్తారు. నేను జూడో చేయగలను. ఇవి కేవలం అభిరుచిలే కాదు. అవి మనం ఎవరో తెలుసుకోవడానికి చెప్పే ఒక కిటికీ లాంటివి. మేం అన్నింటిని గమనిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకం అయి ఉంటాం. నిశ్శబ్ద శక్తితోనే సవాళ్లను ఎదుర్కొనే ప్రవృత్తిని కలిగి ఉన్నాం. బిల్?గేట్స్? లాంటి పెద్దవాళ్లు లేదా సామాన్యులతో మాట్లాడుతున్న ఒకే విధమైన ఆసక్తితో మాట్లాడతాం. నిజమైన నాయకత్వం అంటే నియంత్రణ కాదు. అది మనిషిపై ప్రేమ. ప్రస్తుత భారతదేశంలో సత్యం అనేది లేకపోయినా నేను నిజం కోసమే నిలబడతా’ అని రాహుల్ గాంధీ చెప్పారు.