ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు
` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే
న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై కాంగ్రెస్‌ సహా ఇతర విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సుప్రీం కోర్టు కూడా ప్రాధాన్యం కల్పించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వక్ఫ్‌ ఆస్తులపై వివాదాన్ని సృష్టించేందుకే ప్రభుత్వం ‘వక్ఫ్‌ బై యూజర్‌’ అంశాన్ని లేవనెత్తిందన్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీలు, ఇంఛార్జీల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లను పేర్కొన్నారని ఆరోపించారు.‘‘పెద్ద కుట్రలో భాగంగానే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ గాంధీ పేర్లను పెట్టారని తెలుస్తుంది. ఎవరి పేర్లు పెట్టుకున్నా.. భయపడే ప్రసక్తే లేదు. దీనికి రెండు, మూడు రోజుల ముందే దిల్లీ, లఖ్‌నవూ, ముంబయిల్లోని నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను అటాచ్‌ చేశారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు.

తాజావార్తలు