భారత్‌కు ఎలాన్‌ మస్క్‌..

` మోదీతో సంభాషణ అనంతరం కీలక ప్రకటన
న్యూయార్క్‌(జనంసాక్షి):అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రానున్నట్లు ఎక్స్‌ వేదికగా స్వయంగా ఆయన వెల్లడిరచారు. ప్రధాని మోదీతో సంభాషించడం గౌరవంగా భావిస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పట్లో ఆయన మన పొరుగు దేశం చైనాను సందర్శించారు.ఓ వైపు వాణిజ్య ఒప్పందం కోసం భారత్‌, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఎలాన్‌ మస్క్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ విషయాన్ని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడిరచారు. ‘’మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో మా భేటీ సందర్భంగా చర్చించిన అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి స్పందనగా మస్క్‌ తన భారత పర్యటనను ధ్రువీకరించారు.మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్‌ సంస్థలు భారత విపణిలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే షోరూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టిన ఆ సంస్థ.. భారత్‌ రోడ్లపై ‘మోడల్‌ %్‌%’ కారును పరీక్షిస్తోంది. తాజాగా ముంబయి-పుణె జాతీయ రహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. మరోవైపు స్టార్‌ లింక్‌ ప్రతినిధులు ఇటీవల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చలు జరిపారు. ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో ఇప్పటికే స్టార్‌ లింక్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో మస్క్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది.

తాజావార్తలు