ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్‌ గాంధీ

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. అంతేకాదు, ఆ వ్యవస్థలో చాలా లోపాలున్నాయన్నారు. ఇందుకు ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ బోస్టన్‌ లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజావార్తలు