ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి
న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విచారణకు ఆదేశించారు.పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, తహ్సీన్‌ అనే వ్యక్తికి చెందిన ఈ నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, దిల్లీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు 22మంది శిథిలాల కింద చిక్కున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 12 గంటలకు పైగా చేపట్టిన సహాయక చర్యలు చేపట్టగా, పలువురు రక్షించి, దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ముందు చిక్సిత పొందుతూ 4మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పారు. ఆ తర్వాత ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.గ్రౌండ్‌? ఫ్లోర్‌?లోని రెండు, మూడు దుకాణాల్లో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు. అయితే ఈ నిర్మాణం దాదాపు 20 సంవత్సరాల నాటిదని, పూర్తిగా ఆక్రమించబడినదని దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు అతంస్తుల భవనం కూలిపోయినట్లు తెల్లవారుజామున 2:50 గంటలకు తమకు కాల్‌ వచ్చినట్లు డివిజనల్‌ అగ్నిమాపక అధికారి రాజేంద్ర అత్వాల్‌ అన్నారు. ‘ మేం ఘటనాస్థలికి వెళ్లే సరికి భవనం మొత్తం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, దిల్లీ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు’ అని అత్వాల్‌ తెలిపారు.

తాజావార్తలు