మోదీకి కేటీఆర్ దాసోహం
` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు
` భాజపాతో బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం
` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
్‌హైదరాబాద్(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే భాజపాతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలపై చర్యలు తీసుకోకూడదనే ఉద్దేశంతోనే మోదీకి కేటీఆర్ దాసోహమయ్యారని ఆరోపించారు. భారాస బలహీనత వల్లే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, పదేళ్లపాటు మోదీ తీసుకున్న నిర్ణయాలన్నింటికీ ఆ పార్టీ మద్దతి చ్చిందని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారాస నాయకురాలు కవితను మద్యం స్కామ్ నుంచి కాపాడుకోవడానికి భాజపాకి ఊడిగం చేశారని దుయ్యబట్టారు. భాజపాకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాని గెలిపించాలని ఆయన తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.