చంద్రబాబు అడిగితే ఇవ్వం
– సృజనాచౌదరి తెరవెనక్కు ఎందుకెళ్లాడో బాబు చెప్పాలి
– షేర్ల పేరుతో జనాన్ని మోసం చేసిన వ్యక్తి ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాడు
– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
కాకినాడ,జూన్29(జనం సాక్షి): చంద్రబాబు అడిగితే స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ ఇవ్వబోమని బీజేపీ నేత సోమువీర్రాజు స్పష్టం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కడపలో మూతబడ్డ ఫ్యాక్టరీలు ఎందుకు తెరిపించడంలేదని ప్రశ్నించారు. కడప జిల్లాపై సీఎం రమేష్‌కు నిజంగా ప్రేమ ఉండటింటే నాలుగేళ్ల నుంచి ఎందుకు దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసమే సీఎం రమేష్ దీక్షలను చేస్తున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ఇప్పటికైన దొంగదీక్షలు మాని, డ్రామాలకు తెరదించాలని సూచించారు. టీడీపీలో ఎన్నాళ్లు యాక్టివ్‌గా ఉన్న సుజనాచౌదరి తెర వెనక్కి ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై దాడులకు తెదేపా కార్యకర్తలు తెగబడుతున్నారన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు ప్రజాస్వామ్య ద్రోహిలా మారారని విమర్శించారు. అనంతపురంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. నేతలపై దాడులను ఆపలేకపోతున్న ఏపీ డీజీపీ తెలుగుదేశం పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా మారిపోవాలని సూచించారు. మోసం చేసిన షేర్ల బ్రోకర్ కుటుంబరావు ఏపీ ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నారని గుర్తు చేశారు. బీజేపీపై దాడులతో పాటు టీడీపీ చేస్తున్న ధర్మ పోరాటాలు ఆపాలని అవినీతి చక్రవర్తి చంద్రబాబును హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. కాశ్మీర్‌లో టెర్రరిస్టులకే బీజేపీ భయపడటం లేదని, అలాంటిది చంద్రబాబు తాటాకు చప్పట్లకు మేం ఎలా భయపడతామని వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టంచేశారు.