చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ
రంగారెడ్డి: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో నిర్వహిస్తున్నా చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాబు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుఉ చేసుకున్నాయి. పాదయాత్రను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాబు పాదయాత్రను అడ్డుకున్న కార్యాకర్తలు కులకచర్ల పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి వారిపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వారిని చితకబాదుతున్నట్లు సమాచారం. పోలీసుల అత్యుత్సాహంపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు.