చంద్రబాబు యాత్రకు ముస్లింల మద్దతు
పరిగి: రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పరగి మండలం సుల్తాన్‌పూర్ వద్ద ముస్లింలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు 15 శాసనసభ సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింల ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు రూ. 50 వేలు ఇస్తామన్నారు.