చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు…..ఎస్సై కవిత
బోనకల్, సెప్టెంబర్ 09 (జనంసాక్షి):
బోనకల్ మండలంలో వినాయక నిమజ్జన ఉత్సవాలలో డీజే లు ఉపయోగించవద్దని ఎస్సై కవిత హెచ్చరించారు. డీజే లు వినియోగించరాదని, వినాయక శోభాయాత్రను పోలీసు వారికి కమిటీ వారు తెలియజేసి తగు జాగ్రత్తలు కమిటీ వారు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని శాంతి భద్రతల పరిరక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెహెచ్చరించారు. వినాయక విగ్రహాలను భక్తులు , కమిటీ సభ్యులు నిమజ్జనం కోసం వెళ్లే సమయంలో ప్రధాన రహదారులు, నేషనల్ హైవే పై ఊరేగింపుగా వెళ్లకూడదని, అదే సమయంలో డీజేలు పెట్టి డ్యాన్స్ లు వేయకూడదని పోలీస్ శాఖ నిబంధనల మేరకు కమిటీలు నిమజ్జనం వేడుకలను చేసుకోవాలని కోరారు.వీటిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ వారు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన వేడుకలు ముగించుకొని తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకోవాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని కోరారు.