చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ఎల్లారెడ్డి-(జనంసాక్షి)-జనవరి-
ఎల్లారెడ్డి:మహిళలు విద్యార్థినులు రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులు,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత అన్నారు. ఆదివారం మండలంలోని సోమార్ పేట్ గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళకు సంబంధించిన హక్కులు,కావచ్చు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం అనేక అంశాలపై చట్టం ముందు ఉందమని దాన్ని రాజ్యాంగం బద్దంగా అందరూ సమనంతో ముందుకు వెళ్లాలని అన్నారు. యువకు సేల్ ఫోన్ లో సంబంధించిన విషయాలు ఓపెన్ చేసి వాటిని బయట ప్రయోగించడం తదితర విషయాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మీ మీయొక్క గ్రామాలలో ఇలాంటి సమస్యలు ఉన్నా ఊళ్ళోనే కుచ్చోని పరిష్కరించుకోవలని అన్నారు.చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ గోపాల్ రావు,పండరీ తదితరులు ఉన్నారు.