చదరంగంలో యువ‘రాణి’


` ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌
(జనంసాక్షి):ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (19) నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. చివరి టైబ్రేకర్‌లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే. ఫైనల్స్‌లో దివ్య 1.5 పాయింట్లు.. కోనేరు హంపి 0.5 సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కోనేరు హంపీ తీవ్రమైన పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం నేడు టైబ్రేకర్‌కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో దివ్య కూడా దూకుడుగానే ఆడిరది. ఓ దశలో హంపీని ఒత్తిడికి గురి చేసింది. తాజా విజయంతో దివ్య గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను అందుకొన్నారు. దీంతో భారత్‌లో ఈ హోదా అందుకొన్న 88వ వ్యక్తిగా నిలిచారు.మహిళల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యను మాజీ ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘’ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు అభినందనలు దివ్య. ఉక్కంఠ భరితమైన పోరు. కోనేరు హంపీ కూడా మంచి ఆటతీరు.. పోరాటస్ఫూర్తిని కనబర్చారు. భారత చదరంగానికి సంబరాలను తెచ్చిన విజయం ఇది.