*చదువూలొ వెనకబడిన విద్యార్థుల పై ప్రత్యేక దృష్ఠిసారించాలి!

*జిల్లా సంక్షేమ అధికారి దయానంద్
_________________________
లింగంపేట్ 20 జూలై (జనంసాక్షి)
విద్యార్థులకు నాణ్యమ్తెన బోదన అందించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ అన్నారు.ఆయన బుదువారం లింగంపేట్ మండలంలోని లింగంపల్లి ఖుర్దు మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల,కళాశాలను సందర్శించారు. పలురికార్డులు పరిశీలించారు.చదువులొ వెనకబడిన విద్యార్థుల పై ప్రత్యేక దృష్ఠిసారించాలన్నారు.అనంత లింగంపల్లి సర్పంచ్ బండి రాజయ్య,ప్రిన్సిపాల్ వెంకటరాములు విద్యార్థులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.నాటిన మొక్కలను విద్యార్థులు అధ్యాపకులు సిబ్బంది కంటికి రెప్పల సంరక్షించాలని సూచించారు.అలాగే విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజన వంటలను రుచి చూశారు.బోధన బోధనేతర సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Attachments area