చరవాని లో మెసేజ్ లు పెట్టె వాళ్ళు జర జాగ్రత్త

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి (మే 25)
వాట్స్అప్ లో  ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఫోటోలు వీడియోలు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు
గత రెండు మూడు రోజులనుండి లింగారెడ్డిపల్లి గ్రామం, మండలం సిద్దిపేట  చెందిన కిష్టారెడ్డి  సొసైటీ అనే వాట్సాప్ గ్రూప్ గ్రూప్ లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు పెట్టు చున్నాడు, ఎందుకు పెడుతున్నావని ఏసిపి  అడగగా సరైన సమాధానం చెప్పకుండా దాటవేయి చున్నాడు,  ప్రశాంతంగా ఉండే సమాజాన్ని చెడగొట్టే ఉద్దేశంతో పుకార్లు పుట్టించే పోస్టులు పెట్టొచ్చు  ప్రజలను భయభ్రాంతులకు  గురిచేస్తున్న   అతని పై ఈరోజు సిద్దిపేట ఏసిపి రామేశ్వర్  సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసినారు.
 ఈసందర్భంగా ఏసీపీ రామేశ్వర్  మాట్లాడుతూ  సొసైటీ గ్రూపులో పెట్టిన ఫోటోలు వీడియోలు మన  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కావు, మన భారతదేశానికి సంబంధించినవి కావు, ప్రజలను భయభ్రాంతులు గురు చేసే వాట్స్ అప్,  ఫేస్ బుక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసే  వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసిపి గారు హెచ్చరించారు
వదంతులను నమ్మకండి
పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు, నేరగాళ్లు, దొంగలు గుంపులుగా తిరుగుతున్నారని
ఇటీవల వాట్సప్ మరియు ఫేస్ బుక్ వంటి సామజిక మాద్యమాలలో దొంగలకు చెందిన కొన్ని గ్యాంగులు జిల్లాలోకి ప్రవేశించినారని, రాత్రి సమయాలలో వీధులలో సంచరిస్తున్నారని, వాటి తాలూకు ఫొటోలు కూడా పోస్ట్ చేస్తూ, పలానా రోజు పలానా ఊరిలోకి ఈ ఫొటోలో ఉన్న వ్యక్తులుదొంగలు వచ్చారని ప్రచారం చేస్తున్నారు. వాటి తాలుకూ ఎటువంటి సమాచారం గాని, ఆధారాలు గాని పోలీస్ వారి దగ్గర లేవు. కావున ఇటువంటి అసత్య ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మవద్దని,
ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కావడం, చూడని విషయాలను ప్రచారం చేయడం సరి కాదని  అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 నంబరుకు లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు