చర్లగార్లపాడులో అధ్వానమైన రోడ్లు,వీధిలైట్లు శూన్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చర్ల గార్లపాడు లో పల్లెనిద్ర
మల్దకల్ సెప్టెంబర్ 14 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని చర్ల గార్లపాడు గ్రామంలోనడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బస చేసి బుధవారం ఉదయంగ్రామంలో  తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడం జరిగింది.చర్ల
గార్లపాడులో మురుగునీటి కాలువ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఇళ్ళ ముందు మురుగు నీటి నిల్వ తో దోమలు, ఈగల వల్ల పిల్లలు డెంగ్యూ,టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడుతున్నామని,ఇళ్లలోకి సైతం నీళ్లు వస్తున్నాయని, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పడిపోయిన ఇండ్లు, పిచ్చి మొక్కలను తొలగించకుండా ఉంచడం వల్ల రాత్రుల పూట పాములు ఇళ్ళలోకి వస్తున్నాయని ప్రజలు వాపోయారు.రాత్రుల పూట బయట తిరగాలన్న కనీసం వీధిలైట్లు కూడా లేని పరిస్థితి ఉన్నదని అగ్రహం వ్యక్తం చేశారు.5వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల ఐదో తరగతి చదువుతున్న విద్యార్థికి కూడా తెలుగు వర్ణమాల రావడంలేదని దీంతో చేసేదేమి లేక మా పిల్లల్ని చదువు మాన్పించి పనులకు,కూలీ కి పంపాల్సి వస్తుందని తల్లిదండ్రులు వాపోయారు. ఇక్కడి నుండి మల్దకల్ హైస్కూల్ కు దాదాపు 40 మంది విద్యార్థులు వెళుతుండగా,రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ వెళ్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ చర్లగార్లపాడు గ్రామంలోని సమస్యలు అర్థం కావాలంటే ఒకసారి అధికారులు,కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.ఆధ్వానమైన రోడ్లు, ఇళ్ళ ముందర నిల్వ ఉన్న మురికి నీటి తొ అవస్థలు పడుతున్నారని కనీసం గ్రామంలో వీధిలైట్లు కూడా లేని పరిస్థితి ఉన్నదని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లవన్న,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, రంగ స్వామి, ఉప్పరి కృష్ణ, దాసరి పల్లె రాముడు, బలిజ రాజు, రమేష్,మీసాల కిస్టన్న, నాగర్ దొడ్డి కృష్ణ, నజుముల్లా, ఆలూరు వెంకట్ రాములు భీమయ్య గౌడ్, యేసు,ఎల్లేష్ పరమేష్ లతో పాటు గ్రామస్తులు లక్ష్మన్న,చిన్న నరసింహులు,చిన్న తిమ్మన్న, చెవుల భీముడు,రాముడు పరుష, వడ్ల శంకరన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail