చలనంలో విషయం – చలనంలో అధ్యయనం

(శుక్రవారం సంచిక తరువాయి)
వాటిలో నాలుగో వ్యాసం (దాని మీద రాసిన లేతు గాని, కచ్చితంగా 1965లో రాసినదై ఉంటుంది) లో ఆయన ‘రైతులు ఏ వర్గానికి చెందుతారని నిర్థారించడంలో చాల తరచుగా ఒక పొర పాటు జరుగుతున్నది. అందుకు కేవలం భూమి పట్టా కాగితాలను ఆధారంగా చేసుకుంటున్నారు. ఇది చాల ప్రమాదకరమైన పొర పాటు. ఒకరు వర్గస్థితిని వారి ఆదాయం, జీవన ప్రమాణాల ఆధా  రంగా విశ్లేషించవలసి ఉంటుంది’ అన్నారు. అలాగే ఏడో వ్యాసం (ఇది కూడ తేదీ లేనిదే, కాని 1966లో రాసినది కావచ్చు)లో ఆయ న ‘…భారతదేశం వంటి అర్ధవలస అర్ధభూస్వామ్య దేశంలో విప్ల వపు ప్రధాన శక్తి రైతాంగమే’ అని రాశారు. ఈ రెండు వ్యాఖ్యలూ 1967 మేలో జరిగిన నక్సల్బరీ ప్రజ్వలన ముందువి కాగా, ఆ తర్వాత, నవంబర్‌ 1967లో ఆయన చాల స్పష్టంగా ‘భారతదేశం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశం. దేశంలోని ఈ వలస స్థితిని మార్చగల ప్రధానశక్తి రైతాంగమూ, వారి భూస్వామ్య వ్యతిరేక పోరాటమూ. వ్యవసాయ విప్లవం జరకుండా ఈ దేశంలో ఏ మార్పునూ ఊహించలేం’ అని రాశారు.వ్యవసాయ వర్గ వ్యవస్థ నిర్మాణం గురించీ. అర్ధభూస్వామ్య సూత్రీకరణ గురించీ వారు ము జుందార్‌ చేసిన ఇటువంటి ఎన్నో ప్రస్తావనలతో పాటు చైనా కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక పీపుల్స్‌ డెయిలీ 1967 జూలై 5 న రాసిన సంపాదకీయం ఈ సూత్రీకరణకు బలం చేకూర్చింధి: ‘కాంగ్రెస్‌ సాలనలోని భారతదేశం పేరుకు మాత్రమే స్వతంత్రమైనది. వాస్తవంలో అది ఒక అర్ధవలస, అర్ధ భూస్వామ్య ప్రభువుల, నిరంకుశ దళారీ పెట్టుబదిదారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది’ అని ఆ సంపాదకీయం రాసింది.

అయితే, ఇదంతా భారత కమ్యూనికస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ఇంకా ఏర్పడక ముందు. భారత రాజ్యపు స్వభావం గురించీ, భారత విప్లవం అనుసరించవలసిన వ్యూహం గురించీ సిపిఐ – ఎం లోపల అంతర్గత పోరాటం జరుగుతున్న సంద ర్భంగా. చిట్టచివరికి, 1969 ఏప్రిల్‌ 22న అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈ అర్ధవలస అర్ధభూస్వామ్య సూత్రీకరణకు సమగ్ర నిర్వచనం దొరికింది.

‘….భారత దేశం అర్ధవలస, అర్ధస్వామ్య దేశమనీ, భారత రాజ్యం బడా భూస్వాముల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల రాజ్యమనీ మేం ప్రకటిస్తున్నాం… కొద్దిమంది భూస్వాముల చేతుల్లో అంతకం తకూ ఎక్కువ భూమి కేంద్రీకరించబడడం, రెక్కలుముక్కలు చేసుకు ని రైతాంగం ఉత్పత్తి చేసిన మిగుటు మొత్తాన్నీ కౌలు రూపంలో దోపిడీ చేయడం, గ్రామీణ జనాభాలో దాదాపు 40 శాతం మంది పూర్తిగా భూమిలేని నిరుపేదలుగా ఉండడం, నడ్డివిరిచే అధిక వడ్డీరేట్ల దోపిడీ, పేద రైతాంగాన్ని వారి భూములనుంచి తొలగిం చడం, మధ్యయుగాలను తలపించే హరిజనుల సజీవదహనాల వంటి పాశవిక సామాజిక అణచివేత, ఉత్పత్తి పద్ధతులు అత్యంత వెనుకబాటుతనంలో ఉండడం వంటి అక్షణాలన్నీ కలొసి5 మన రసమాజపు అర్ధభూస్వామ్య స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి’ అని ఆ తీర్మానం రాసింది. ‘ఈ దశలో భారత విప్లవం కొత్త తరహా ప్రజాస్వామిక విప్లవంగా, ప్రజల ప్రజాస్వామిక విప్లవంగా ఉంటుం ది. దాని ప్రధాన స్వభావం గ్రామసీమలలో భూస్వామ్యాన్ని రద్దు చేసే వ్యవసాయ విప్లవంగా ఉంటుంది…. అని కూడ ఆ తీర్మానం రాసింది.కొత్తగా రూపొందిన పార్టీ గ్రామీణ వర్గ వ్యవస్థను అధ్యయనం చేయడానికీ, విశ్లేషించడానికీ ప్రయత్నాటు ప్రారంభించిందనడానికి రుజువులను ఆ పార్టీ అధికార పత్రిక లిబరేఫన్‌ మొదటి సంచిక (జూన్‌ 1969) లోనే చూడవచ్చు. ‘దోపిడీ స్వభావం, రూపాల గురించి ఒక పరిశోధన: ఒక గ్రామ వర్గ విశ్లేషణపై నివేదిక’ అనే ఆ వ్యాసంలో దోపిడీ గురించి సవివర మైన చిత్రణతో పాటు పార్లమెంటరీ వామపక్షాలకు భిన్నంగా విప్లవ రాజకీయ వ్యూహం ఎందుకు సమర్థించదగినదో వివరణా ఉంది. ఈ సూత్రీకరణను 1970 మేలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు- లెనినిస్టు) కాంగ్రెస్‌ లో ఆమోదించిన ‘పార్టీ కార్యక్రమం’లో ధ్రువీకరించారు. ‘1947లో ప్రకటించిన బూటకపు స్వాతంత్య్రం పాత వలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ స్థానంలో అర్ధవ లస అర్ధభూస్వామ్య వ్యవస్థను నెలకొల్పడం తప్ప  మరేమీ కాదు’ అని ఆ కార్యక్రమం రాసింది. ఆ కార్యక్రమంలో అర్ధభూస్వామ్య భావన అనేకసార్లు ప్రస్తావనకు వచ్చింది. ‘అర్ధభూస్వామ్య భూసం బంధాలు మన దేశాన్ని నిరంతరం కరువుకాటకాలలో ముంచివ ేయడంతో ప్రతి ఏటా లక్షలాది మంది ఆకలిచావుల పాలవుతు న్నారు’ అని కార్యక్రమం రాసింది. కొద్దిరోజుల్లోనే నక్సల్బరీ, శ్రీకా కుళ పోరాటాలు తాత్కాలిక అపజయానికి గురయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ఎన్నోసార్లు చీలిపో యింది. ప్రస్తుతం దేశంలో తమను తాము మార్క్సిస్టు లెనినిస్టు వారసులుగా చెప్పుకునే పార్టీలు మాత్రమే తమ ఆచరణలో భాగంగా అర్ధభూస్వామ్య అర్ధవలస భావనను బలపరచుకునే ప్రయత్నాలు చేశాయి. వ్యూహానికీ ఎత్తుగడలకూ సంబంధించిన ఇతర సమస్యలు, ముఖ్యంగా పార్లమెంటరీ ఎన్నికలలో ప్రధానపాత్ర వహించడానికి వ్యవసాయ సంబంధాలను అధ్యయనం చేయడం విశ్లేషించడం మీద చాల పార్టీలు దృష్టి పెట్టలేదు.

ఈ నేపథ్యంలో నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల వేనుకంజ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విప్లవకారులు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, పంజాబ్‌లలో మిగిలిపోయిన శాఖలతో కలిసి 1973లో సిపిఐ (ఎం-ఎల్‌) కేంద్ర ఆర్గనైజింగ్‌ కమిటీ (సిఓసి) ని రూపొందించారు.ఈ సమయంలోనే సిఓసి ప్రజా సంథా గురించి వినూత్న ఆలోచనలు చేసింది. ఆ ఆలోచనలన్నీ 1974లో రూపొం దిన ఆత్మవిమర్శనా రిపోర్టు అనే డాక్యుమెంటులో సంఘటి తమయ్యాయి. ఈ డాక్యుమెంటు మార్గనిర్దేశకత్వంలో రాడికల్‌ విద్యార్థి సంఘం నిర్మాణమయింది. త్వరలోనే ఎమర్జెన్సీ ప్రకటిం చడంతో రుడికల్‌ విద్యార్థులు అధ్యయనం కోసమూ, పోరాటాలను నిర్మించడం కోసమూ గ్రామాలకు తరలివెళ్లారు. ఈ అనుభవాలు, అధ్యయనాలు కలిసి వ్యవసాయ విప్లవం అనే కీలక రచనగా రూపుదిద్దుకున్నాయి. అయితే 1978లో ఈ రచన అచ్చయ్యేనాటికి సిఓసి పనిచేయలేని స్థితి ఏర్పడి, ఆ పుస్తకం సిపిఐ(ఎం-ఎల్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ పేరు మీదనే వచ్చింది.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల రైతాంగంలో ప్రత్యేకంగానూ, మొత్తంగా రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రకమిటీ మూడు సంవత్స రాల పాటు నిర్వహించిన పోరాటాల వల్ల దేశవ్యాప్తంగా విప్లవకా రులందరి దృష్టీ ఈ పోరాటాలవైపు మళ్లింది. అలా రూపొందిన ఐక్యతతో 1980 ఏప్రిల్‌ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) (పీపుల్స్‌ వార్‌) ఏర్పడింది. ఈ పార్టీ కేంద్ర కమిటీ అధికారపత్రిక వాయిస్‌ ఆఫ్‌ వాన్‌గార్డ్‌ మొదటి సంచిక నుంచి ప్రారంభించి ‘భారత వ్యవసాయం-పె ట్టుబడిదారీనా, పెట్టుబ డిదారీ పూర్వమా?’ అనే సవివరమైన విశ్లేషణను ప్రచురించింది. ఈ వ్యాసం భూవినియో గం,భూకమతాలు,వ్యవసాయ ఉత్పత్తి కార కాలు, ఉత్పాదకతా ధోరణులు, రుణ-పరపతి సౌకర్యాలు, రైతాంగ విభజన, మార్కెట్‌, మిగులు వినియోగం అనే ఎనిమిది ప్రాతిపదికల మీద ఆధారపడి అర్ధభూస్వామ్య సూత్రీకరణను సమర్థించింది. ఆ తర్వాత కూడ ఆ పత్రిక వ్యవసాయ సంబంధాల మీద, పోరాటాల మీద ఎన్నో అధ్యయనాలు, నివేదికలు, విశ్లేషణలు ప్రకటించింది.

– మిగతా రేపటి సంచికలో…

-ఎన్‌.వేణుగోపాల్‌

వీక్షణం సౌజన్యంతో…)