చలో అసెంబ్లీకి అనుమతి లేదు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం
సీపీ అనురాగ్‌శర్మ
హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :
చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి అనుమతి లేదని, ఈ కార్యక్రమం ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్‌ కవిూషనర్‌ అనురాగ్‌శర్మ హెచ్చరించారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఆందోళనలకు గతంలో అనుమతిచ్చినప్పుడు జరిగిన విధ్వంసాలను ఇంకా పోలీసులు మరిచిపోలేదన్నారు. మిలియన్‌మార్చ్‌, సాగరహారం, సమ్మరదీక్షల పేరుతో తెలంగాణ ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు చేసిన అందోళనల్లో పలు కేసులు కూడా నమోదయ్యాయన్నారు. ముందుగా ఎలాంటి విధ్వంసాలు జరుగనీయమని కోరే పార్టీలు, ఉద్యోగ సంఘాలు తర్వాత వారి చేతుల్లో లేకుండానే ఉద్యమం పోతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని తాము ఖూనీ చేస్తున్నామనే ఆరోపణలను కవిూషనర్‌ ఖండిరచారు. తాము ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే ఉద్యమాలను ఎప్పుడు కూడా అడ్డుకోలేదన్నారు. నిన్నటికి నిన్న ఆర్‌ఎల్‌డికి, మొన్న టిఆర్‌ఎస్‌, బిజెపిలకు సంబంధించిన సభలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వలేమన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూసేందుకు ఏఒక్కరు ప్రయత్నించినా ఊరుకోబోమన్నారు. తాము పకడ్బందీగా బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎలాంటి సవాల్లనైనా ఎదుర్కోవాల్సిన అవసరం లేదన్నారు. నగరం చుట్టూ 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మల్టీలెవల్‌ అరెంజ్‌మెంట్స్‌ కూడా చేశామన్నారు. అసెంబ్లీ వైపు వచ్చేవారిని అడ్డుకుని తీరుతామన్నారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు. సిటీ పోలీస్‌ యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలులో ఉందన్నారు. ఈకార్యక్రమం సందర్బంగా నగరంలో వైన్‌షాపులు, బార్‌షాపులు కూడా మూసివేయిస్తున్నామన్నారు. బందోబస్తును పటిష్టంగా ఏర్పాటుచేసేందుకు గాను అదనపు బలగాలను ఇప్పటికే దింపడం జరిగిందన్నారు. 10మంది అదనపు ఎస్పీలు, 30మంది డీఎస్పీలు, 50మంది సీఐలు, 300ఎస్‌ఐలు, 300 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 800మంది కానిస్టేబుళ్లను నియమించామన్నారు. ఇంతేకాకుండా 190 ప్లటూన్ల ఎపీఎస్పీ బలగాలు రంగంలోకి దిగాయన్నారు. అలాగే కేంద్రీయ బలగాలు, బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలను దించామన్నారు. అయినప్పటికి చేధించుకు అసెంబ్లీ వైపు వస్తుంటే పట్టుకుని కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. జంక్షన్‌లలో వీడియో కెమెరాలను కూడా పెట్టడం జరిగిందన్నారు. తమ ఓపికను పరీక్షించాలనుకుంటే జరిగే పరిణామాలకు తాము బాధ్యులము కానే కాదన్నారు. ప్రజలు ఈకార్యక్రమానికి రావద్దన్నారు. ఉద్యోగులైతే తమతమ ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరుగుతుందని అనురాగ్‌శర్మ హెచ్చరించారు. అసెంబ్లీకి రెండుకిలోమీటర్ల దూరంలో నిషేధాజ్ఞలున్నాయ న్నారు. అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందన్నారు.