చలో ఢిల్లీ విజయవంతం చేయండి

 

* బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
ఆగస్టు 7 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని TNGO’S ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన గోడ ప్రతిని ఆవిష్కరించారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ , జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ అధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 7 న ఢిల్లీ లోని తల్కటోర స్టేడియం లో అఖిల భారత జాతీయ OBC మహాసభ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే 8న పార్లమెంట్ ముట్టడి, 9న OBC జాతీయ కార్యవర్గ సమావేశం ఉంటుందని తెలిపారు.ఈ పార్లమెంట్ సమవేశాల్లోనే బీసీ జనగణన చేపట్టాలనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో OBC లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్థిక రంగాలలో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాలని కోరారు.విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్,రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచెర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ఇట్టి సమావేశాలకు రాష్ట్రం లోని వివిధ జిల్లా ల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్,రాష్ట్ర కార్యదర్శులు రాగి సత్యనారాయణ,GS ఆనంద్,రంగు సంపత్ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఐల ప్రసన్న,జిల్లా ఉపాధ్యక్షులు కయితోజు బ్రహ్మచారీ,దుంపట మురళి,జిల్లా అధికార ప్రతినిధి పోశాల రవికుమార్,నాయకులు వినయ్, బియ్యాన్ని తిరుపతి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.