చల్మెడ ఉచిత వైద్యశిబిరానికి విశేషస్పందన
కరీంనగర్, ఆగస్టు 7 (జనంసాక్షి) : జిల్లా వికాస తరంగిణి ఆధ్వర్యంలో, చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యతో నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాప్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆర్టీసీ వర్క్‌షాప్ లో గల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్యశిబిరాన్ని వినియోగించుకున్నారు. వైద్యులు వారిని పరిశీలించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ చల్మెడ లక్ష్మీ నర్సింహారావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ మహిళల, ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కొరకు ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య సేవలందిస్తున్నామని పేర్కోన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అమెరికా నుంచి డాక్టర్ .రఘు డాక్టర్. సూర్యలు వచ్చి పరిశీలించారు. ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ వర్క్‌షాప్ వర్క్‌మేనేజర్ జిఎస్. సురేష్, అసిస్టెంట్ వర్క్‌షాప్ మేనేజర్ గోపాల్‌కృష్ణ, సీఓఎస్ విజయ్ భాస్కర్ ఏడబ్ల్యూ ఏమ్ విజయ్ రావు, ఏమ్‌ఏఫ్ వెంకటేశ్వర్లు, ఎల్‌ఏచ్‌డీ ప్రతాఫ్ రెడ్డి టైల్స్ సెక్షన్ సీఎస్‌ఎన్ స్వామీ,మధుకర్ ,నాయకులు గులాం అహ్మాద్, బాస్కర్, విలాస్‌రెడ్డి, నందన్ రావు, వికాస తరంగిణి ప్రభాకర్ రావు, సత్యనారాయణ రెడ్డి, వాలంటీర్, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.