చాపరాయి గేడ్డ వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలి.

 

డుంబ్రిగుడ(ఫిబ్రవరి 17జనం సాక్షి) పోతంగి పంచాయితీ పెద్దపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించేందుకుగాను చాపరాయి జలపాతం గేడ్డలో మిషన్ కనెక్టివిటీ పథకం ద్వారా బ్రిడ్జి నిర్మాణానికి పాడేరు ఐటీడీఏ పీవో వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ సంఘం నాయకులు గ్రామస్తులు కలిసి డిమాండ్ చేశారు.గురువారం ఆయన గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈనెల 2వ తేదీన చాపరాయి జలపాతంలో సందర్శించిన ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ పెద్దపాడు గ్రామానికి రోడ్డు నిర్మాణానికి మిషన్ కనెక్టివిటీ పథకం ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఉన్నారని పేర్కొన్నారు.దాన్ని అనుగుణంగా చర్యలు చేపట్టి గ్రామస్తులకు రవాణా కష్టాలు తీర్చాలని గ్రామస్తులతో కలిసి కోరారు.ఈ కార్యక్రమంలో పి.హరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.