చికిత్స పొందుతూ యువకుడి మృతి
వరంగల్ రూరల్,జూలై23(జనంసాక్షి): రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. జారిపడిన వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. సంగెం మండలం ఏల్గురు రైల్వేస్టేషన్ సవిూపంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి నుంచి సామర్లకోటకు రైలులో వెళ్తున్న మణికంఠ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. దీంతో మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడని సంగెం పోలీసులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.