చిట్యాల వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న భాజపా నాయకులు
వనపర్తి బ్యూరో అక్టోబర్ 28( జనంసాక్షి)
చిట్యాల గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో బిజెపి జిల్లా నాయకులు పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు .
ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జి పెద్దిరాజు మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన రామాయణ కావ్యం కుటుంబ బంధవ్యాలలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని ఆదర్శంగా కొలుస్తుంటారని అలాంటి రామాయణం కావ్యాన్ని ప్రపంచానికి అందించిన ఆదికవి మహర్షి వాల్మీకి అని నేటి తరంలోని విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు కూడా రామాయణ కావ్యాన్ని చదవడం చేసుకొని అందులోని మంచి విషయాలను తమ దయనందిన జీవితాలలో ఆచార వ్యవహారాలు పాటించాలని అప్పుడు మాత్రమే మనము రామాయణ కావ్యానికి కల్పించే నిజమైన గౌరవం అని పేర్కొన్నారు.
వందలాది సంవత్సరాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు సంతుష్రీకరణ రాజకీయాల లో మరుగున పడిపోయిన అయోధ్య రామాలయం సమస్యను యుగపురుషుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించి 2024 జనవరి 22న భవ్యమైన దివ్యమైన రామాలయ ని ప్రపంచానికి అంకితం చేయబోతున్నారని వాల్మీకి మహర్షి ఆశయాలకు ఆలోచనలకు దేశంలోని 140 కోట్ల జనాభా తరపున ప్రధానమంత్రి గారు వాల్మీకి మహర్షి కలలను సహకారం చేయబోతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డా.ఏ.రాజ వర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.నారాయణ, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జింకల కృష్ణయ్య ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా యు మోర్చా అధ్యక్షులు అనుజ్ఞ రెడ్డి, గజరాజుల తిరుమలేష్ మధుసూదన్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఎద్దుల రాజు డి బాలరాజు రమేష్ పోతు శ్రీనివాసులు శ్రీనివాస్ గౌడ్ జంగిడి యాదగిరి వాల్మీ వాల్మీకి సంఘ నాయకులు కొక్కు నరేష్ గబ్బర్ సింగ్ నరేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.