చిత్రలేఖనం అద్బుతమైన కళ….
ఎడవెల్లి కృష్ణారెడ్డి….
జనగామ కలెక్టరేట్ జూలై (జనం సాక్షి): చిత్రలేఖనం అద్బుతమైన కళ అని, ఊహకు ప్రతిరూపం ఇచ్చే కళను అదరించాల్సిన అవసరం ఉందని, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు వేయాలని జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి అన్నారు.శుక్రవారం జనగామ జిల్లా గ్రంథాలయంలో కీ.శే. మసురం పుల్లయ్య 92వ జయంతి సందర్భంగా స్టేట్ లెవల్ చైల్డ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ 2022ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.కళానిలయం వ్యవస్థాపకులు మసురం రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణా రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు, మానవ జీవన విధానం చిత్రకళలో అర్థవంతంగా వివరించడం అభినందనీయమని అన్నారు. చిత్రకళా రంగంలో మూడు తరాలుగా మసురం రాజేంద్రప్రసాద్ కుటుంబం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. చిత్రకళను అదరించాల్సిన అవసరం వుందన్నారు. మనో సంకల్పంతో చిత్రకళకు అంకురార్పణ జరుగుతుందని లయన్స్ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు అన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జాతీయ స్థాయిలో ఎర్పాటు చేశామని అన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, ఆర్ట్ గ్యాలరీ బ్రోచర్ ఆవిష్కరించారు. చిత్రలేఖనాలు వేసిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కవి తిలక డాక్టర్ లింగపల్లి రామచంద్ర, కవి హృదయం సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, జి.వై.గిరి పౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, ప్రజా వాగ్గేయకారుడు సాంబరాజు యాదగిరి, కవి డాక్టర్ వేముల సదానందం, వాసవి గెలాక్సి క్లబ్ అద్యక్షుడు గందే వేణు, కీర్తి నర్సయ్య
గ్రంథాలయ అధికారి కృష్ణ, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, గజవెల్లి ప్రతాప్, వినిషీత్, నవ్యశ్రీ, తదితరులు పాల్గొన్నారు.