చిత్రాలతో నీటి చైతన్యం 

ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి): వేసవిలో నీరు దొరకని ప్రదేశాల్లో జనాలు, పశుపక్షాదులు పడుతున్న కష్టాలు అన్నీఇన్ని కావు. నీరుందికదాని వృథాచేస్తే భవిష్యత్‌ తరాలకు నీరు లేకుండా పోతుంది. చిన్నపాటి పనులకు, తక్కువనీటితో పోయేదానికి ఎక్కువమొత్తంలో నీటిని వృథాచేయొద్దని, వర్షపునీటిని భూమిలోకి ఇంకించాలని, ప్రతినీటి బొట్టు విలువైనదేననే ఆలోచింపజేసే చిత్రాలను గీశాడు సాజిద్‌. తన చిత్రాల ద్వారా నీటి పొదుపును వివరిస్తున్నాడు. కడెం మండలం ఎలగడప గ్రామానికి చెందిన యువ కళాకారుడు అబ్దుల్‌ సాజిద్‌కు చిన్ననాటి నుంచి చిత్రాలు గీయడం అలవాటు. సామాజిక పరమైన చిత్రాలు గీస్తూ పలువురి మన్ననలు పొందుతున్న ఈ యువకుడు సామాజిక చైతన్యాన్ని గుర్తించాడు. గతంలో ఓటు విలువ తెలుపుతూ, నీటినిల్వ ఆవశ్యకత, నీటి వృథాను అరికట్టాలనే చిత్రాలు గీసి తనవంతుగా చిత్రాలతో సమాజంలో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాడు. తనకు తానుగా చిత్రాలు గీయడం నేర్చుకుని అందులో మెళకువలు నేర్చుకుని చిత్రాలు గీయడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నాడు.సామాజికపరమైన చిత్రాలు గీస్తూ ఆలోచింపజేస్తున్న యువకుడిని పలువురు అభినందించారు. 

తాజావార్తలు