చిన్నతనం నుంచి దొంగతనాలు అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు
పది మోటార్ సైకిళ్ల స్వాధీనం
వివరాలు వెల్లడించిన సి పి కె.నాగరాజు
జనం సాక్షి ఆర్మూర్ క్రైమ్ న్యూస్ జూలై 23 : అతనికి చిన్ననాటినుంచి దొంగతనాలు చేయడం అలవాటయింది. ఇప్పటికీ పలు దొంగతనాల్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. బైకుల దొంగతనం లో ఆరితేరి పోలీసులకు చిక్కాడు.
ఆర్మూర్ పట్టణం లోని ధోబి ఘాట్ జాతీయ రహదారి 63 వద్ద పెర్కిట్ కు చెందిన మొహమ్మద్ వాహిద్ అలీ శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆర్మూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్ జిల్లా సి పి కె.నాగరాజు విలేకరులకు బైకు దొంగతనం లో నిందితుడి వివరాలు వెల్లడించారు.
ఆర్మూర్ పట్టణంలో నీ దోబీఘాట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని విచారించగా ఆర్మూర్, బాల్కొండ నిజామాబాద్ జగిత్యాల్ అదిలాబాద్ పరిధిలో రోడ్లపై పార్క్ చేసిన వాహనాలలో హ్యాండిల్ లాక్ చేయకుండా ఉన్న వాహనాలను తన దగ్గర ఉన్న తాళంతో బైక్ స్టార్ట్ చేసుకొని పారిపోతాడని తేలింది. ఇలా పది ద్విచక్ర వాహనాలను దొంగిలించుకుని పోయినట్లుగా విచారణలో తేలింది.
గతంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ ఏ సి పి ప్రభాకర రావు ఆధ్వర్యంలో సీఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రదీప్ కుమార్, శ్రీకాంత్, ఏ ఎస్ ఐ షేక్ గఫ్ఫార్ , హెడ్ కానిస్టేబుల్ షేక్ సలీం కానిస్టేబుల్ గంగా ప్రసాద్, ప్రసాద్, కేసు చేయించగా సి పి అభినందించారు.