చిన్న మండలాలతో పరిపాలనా సులభతరం అవుతుంది
రైతు బంధు సమితి అధ్యక్షులు వీరగాని సాంబయ్య…
మండల సాధన సమితి రిలే నిరాహారదీక్షకి మద్దతు..
ములుగు బ్యూరో,ఆగస్ట్10(జనం సాక్షి):-
చిన్న మండలాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు,పరిపాలన ప్రజలందరికీ సులభతరం అవుతుందని లక్ష్మీదేవిపేట క్లస్టర్ రైతు బంధు సమితి అధ్యక్షులు వీరగాని సాంబయ్య అన్నారు.నూతన మండల ఏర్పాటుకై గత కొన్ని రోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షకి హాజరై మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ చిన్న జిల్లాలతో ప్రజలకు పరిపాలన సులభతరం ఐందని, అదేవిధంగా చిన్న మండలాలతో ప్రజలకు మరింత చేరువలో పరిపాలనా అందుతుందని,లక్ష్మీదేవిపేట ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అన్నారు.
చుట్టూ ప్రక్కల 15గ్రామాలు,7 ఎంపీటీసీ లు ఉన్న ఈ గ్రామాన్ని మండలంగా గుర్తిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు.ములుగు జిల్లాలో కూడా మండలాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు లక్ష్మీదేవిపేట పరిధిలో లక్ష్మీదేవిపేట,రాంనాథ్ పల్లి,నల్లగుంట,అడవిరంగాపూర్,బం డ్లపహాడ్ రెవెన్యూ గ్రామాలుగా ఉన్నాయని అన్నారు.నాటి నుండి చుట్టూ ప్రక్కల గ్రామాలకు వాణిజ్య,వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్న ఈ లక్ష్మీదేవిపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అన్నారు.రిలే నిరాహారదీక్షలో సర్పంచ్ లు గట్టు కుమారస్వామి,పోలం లక్ష్మణ్, మండల సాధన సమితి నాయకులు తండ రమేష్, అంతటి రాము,ముడిగె రాజ్ కుమార్,గట్టు శ్రీనివాస్,పత్తిరి దశరథం,నడిగొట్టు సుదర్శన్,అల్లం కుమారస్వామి, అంతగిరి రాజు,జిముడ రాజు,అల్లం సమ్మక్క,కొండన్న,బైరి సంతోష్,పెంట ఐలయ్య,అల్లం సమ్మయ్య,చెన్న శ్రీను, పత్తి రవి,మండల మధుకర్, శ్రీకాంత్,బీనవేన రాజు, శ్రీనివాస్,ఉడుత రాకేష్,గౌడ సర్వేషం తదితరులు పాల్గొన్నారు.